VIDEO: ఏడుపాయలలో సంప్రోక్షణ.. ప్రత్యేక అలంకరణలో వన దుర్గమ్మ
MDK: పాపన్నపేట మండలంలోని ఏడుపాయల దివ్య క్షేత్రంలో బుధవారం నిన్నటి గ్రహణం అనంతరం శుద్ధి, సంప్రోక్షణ పూజలు చేశారు. ఈ సందర్భంగా మన దుర్గ భవాని అమ్మవారి అభిషేకం, అలంకరణ, సహస్రనామ కుంకుమార్చన, మహానివేదన, నక్షత్ర హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు రోజువారిగా దర్శనం కల్పిస్తున్నారు.