గుంతలతో వాహనదారుల ఇబ్బందులు
KRNL: దేవనకొండ సీఎల్ఆర్ బిల్డింగ్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు గుంతలు గుర్తించలేక ప్రమాదాలకు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ గుంతకల్లు, పత్తికొండ, కర్నూలుకు వందలాది వాహనాలు నడిచే ఈ రహదారి మరమ్మతుల కోసం స్థానికులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదన్నారు.