ఎస్పీలతో క్రైమ్ రివ్యూ సమావేశం

ఎస్పీలతో క్రైమ్ రివ్యూ సమావేశం

VZM: విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ-అడిక్షన్, సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియా కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.