మార్కెట్ నిర్మాణానికి నాబార్డు ప్రతిపాదనలు
KRNL: నందవరం BJP కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ ఆధ్వర్యంలో ఇవాళ నాబార్డు అధికారులతో సమావేశం జరిగింది. గ్రామంలో మార్కెట్ నిర్మాణానికి నాబార్డు రూ.15 లక్షలు కేటాయిస్తుందని, గ్రామపంచాయతీ రూ.1.70 లక్షలు భరించి కనీసం 20 సెంట్ల స్థలం ఇవ్వాలని అధికారులు తెలిపారు. మార్కెట్‌తో పాటు కార్యాలయాన్ని నిర్మించి గ్రామపంచాయతీకి అప్పగిస్తామన్నారు.