ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం
KMM: కామేపల్లి మండలం ముచ్చర్ల గొల్ల బజారులోని జక్కుల వీరయ్య ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండడంతో స్థానిక నివాసులు భయాందోళన చెందుతున్నారు. గాలివానకు స్తంభం వంగిపోయి తీగలు కిందికి జారాయి. స్తంభం ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.