‘చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
KDP: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనాల శివ నారాయణ కోరారు. ఇందులో భాగంగా శుక్రవారం చేనేత జౌళి శాఖ అధికారి శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. అనంతరం జీఎస్టీ విధింపు వల్ల చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, చేనేతలకు రుణాలు అందలేదని ఆయన తెలిపారు.