VIDEO: మండలంలో జోరుగా పోలింగ్
HNK: ఐనవోలు మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు 85.81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, భద్రతా బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.