హుస్నాబాద్‌కు తరలివెళ్లిన సైదాపూర్ నాయకులు
KNR: సెప్టెంబర్ 3న చేయూత పెన్షన్ల పెంపునకు ఏర్పాటు చేసిన సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సంఘాల తిరుపతి పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్‌లోని నిర్వహించే సన్నాహక సమావేశానికి సైదాపూర్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో బత్తుల లక్ష్మీనారయణ, గాదేపాక అశోక్, రుద్రారపు రవితేజ, రవి తదితరులు ఉన్నారు.