వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు

వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు

WGL: నగరంలోని బట్టల బజార్‌లో గల శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి నీరు చేరింది. బుధవారం తెల్లవారుజాము నుంచి దంచి కొడుతున్న భారీ వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాల్లోకి నడుము లోతు నీరు చేరింది. ఇదే క్రమంలో సాయంత్రం సమయానికి ఆలయం ముఖ ద్వారం గుండా వరదనీరు లోపలికి వచ్చింది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు, సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.