ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి
JGL: కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో జవిడి రఘుపతి రెడ్డి(35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గుజరాత్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎస్సై నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.