విద్యార్థికి ఎమ్మెల్యే అభినందన

NLG: మునుగోడు మండల కేంద్రానికి చెందిన దుబ్బసాయి శ్రీ వర్షిత్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో వృత్తి విద్య కోర్సు (MLT) పూర్తి చేశాడు. 991/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా స్థానిక MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి విద్యార్థిని పిలిపించుకుని మంగళవారం సన్మానించి అభినందించారు.