VIDEO: సీతా రాముల తిరువీధి ఉత్సవం
SKLM: అరసవల్లిలోని బొంపడ వీధిలో ఉన్న రామ మందిరంలో శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు హరిబాబు శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామ తిరువీధి నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు.