పేకాట స్థావరంపై పోలీసులు దాడులు

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు

ELR: భీమడోలు మండలం దుద్దేపూడి శివారు అన్నేవారిగూడెంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 10,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మదీనాబాషా తెలిపారు. పేకాట, కోడిపందాలు నిర్వహించినా, పాల్గొన్న కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.