నవంబర్ 3 వరకు పత్తి కొనుగోళ్లు బంద్
NLG: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కట్టంగూర్ మండలం అయిటిపాములలోని శ్రీనాథ్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో నవంబర్ 3వ తేదీ వరకు పత్తి కొనుగోళ్లు బంద్ చేయనున్నట్లు మార్కెట్ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి బీవీ రాహుల్ చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.