'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'
MHBD: తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో సెక్షన్ 163(144) అమలులో ఉన్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం కాగా రహదారులు, హైవేలు ఫుట్ పాత్ లపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించడం నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.