పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీ చేసిన ఎస్పీ
BDK: పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు జారీ చేశారు.