నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం మండల పరిధిలోని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ మురళీ గౌడ్ తెలిపారు. మండలానికి 2600 రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరవుతారని తెలిపారు.