బాధిత మహిళకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్థిక సాయం

బాధిత మహిళకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్థిక సాయం

NLR: సీతారాంపురం మండలం సోంపల్లికి చెందిన గొల్లపల్లి పవిత్ర, భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.