ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
KNR: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. సెకండ్ ఇయర్లో భారీ తేడా కనిపించింది. 2025లో ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 69.84% ఉండగా, ఈ ఏడాది 70.17% కి స్వల్పంగా పెరిగింది. సెకండ్ ఇయర్లో గతేడాది 73.81% ఉత్తీర్ణత నమోదు కాగా ఏకంగా 80.04% విద్యార్థులు పాస్ అయ్యి అదరగొట్టారు.