మండల స్థాయి స్కూల్ గేమ్స్ పై సమీక్ష

మండల స్థాయి స్కూల్ గేమ్స్ పై సమీక్ష

SRD: సిర్గాపూర్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు ఆగస్టు 29, 30న నిర్వహిస్తున్నట్లు MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు. గురువారం MRCలో గేమ్స్ టీచర్లతో సమావేశం నిర్వహించారు. అండర్-14, 17 విభాగాల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్ గేమ్స్ బాలబాలికలకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాల్గొనే విద్యార్థుల బోనాఫైడ్ MRCలో సమర్పించాలన్నారు.