త్వరలో రోదసిలోకి భారత వ్యోమగామి: ప్రధాని

త్వరలో రోదసిలోకి భారత వ్యోమగామి: ప్రధాని

భారత్ ఎన్నో విజయాలను సాధిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన అంతరిక్ష పరిశోధనలపై గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మోదీ.. 'మంగళ్‌యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం. చంద్రుడిపై నీటి జాడ ఉందని తొలిసారి చంద్రయాన్ ద్వారా గుర్తించాం. త్వరలో భారత వ్యోమగామి రోదసిలో పర్యటిస్తాడు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడతాడు' అని చెప్పారు.