VIDEO: చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను సందర్శించిన ఐటీడీఏ పీవో
ASR: కాఫీ పండ్ల రకాలు బట్టి గ్రేడ్లు నిర్ధారించాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను సందర్శించారు. కాఫీ పండ్లు, పార్చమెంట్‌ను పరిశీలించారు. పండ్ల గ్రేడ్లు ప్రకారం పార్చమెంట్‌ను డ్రాయింగ్ చేయాలని సూచించారు. అరకు కాఫీకి అత్యున్నత ప్రాధాన్యత ఉందని, దానికి తగినట్లుగా రైతులు కష్టపడి లాభాలు అర్జించాలని అన్నారు.