'బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి టీడీపీ కృషి'
SRPT: మోతే మండలంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఈ రోజు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కోడె వాసుదేవరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం నుంచి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు.