అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జేసీ ఇలక్కియ
NTR: అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ ఇలక్కియ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పీడీఎస్ బియాన్ని అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.