మెగా జాబ్ మేళా.. నియామక పత్రాల పంపిణీ

మెగా జాబ్ మేళా.. నియామక పత్రాల పంపిణీ

MLG: మంగపేట మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆవరణలో భూక్య జంపన్న ఆధ్వర్యంలో ఇవాళ మెగాజాబ్ మేళా ఉత్సాహంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన నిరుద్యోగ యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.