108 అంబులెన్స్‌లో కవలలు జననం
MBNR: అడ్డాకల్ మండలం రామచంద్రపూర్‌కు చెందిన దీప్తి (20) అనే మహిళ అంబులెన్స్‌లోనే కవల పిల్లలకు (మగ) జన్మనిచ్చింది. బుధవారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 సిబ్బంది యాదయ్య, జహంగీర్ చాకచక్యంగా వ్యవహరించి కాన్పు చేశారు. తల్లి, పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.