హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
TG: హైదరాబాద్‌లోని విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్ నుంచి విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటర్లు గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై రద్దీతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.