తాగునీటి కోసం పులుగుప్ప గ్రామస్తుల శ్రమదానం

తాగునీటి కోసం పులుగుప్ప గ్రామస్తుల శ్రమదానం

 ASR: జీకే వీధి మండలం పులుగుప్పలో తాగునీటి సమస్య తీవ్రమైంది. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ప్రతి ఇంటి నుండి చందాలు సేకరించి, సిమెంట్, ఇసుక కొనుగోలు చేసి పనులు ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.