'ఎలాంటి సమాచారం లేకుండా పత్తి పంట నాశనం సరికాదు'

'ఎలాంటి సమాచారం లేకుండా పత్తి పంట నాశనం సరికాదు'

BDK: బూర్గంపాడు మండలం గోపాలపురంకు చెందిన సర్ప సరస్వతి అనే గిరిజన మహిళ రెండు ఎకరాల పోడు భూమిలో పత్తి పంట సాగు చేసింది. అయితే నిన్న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు సుమారు ఎకరం మేర పత్తి పంటను పీకేసారని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేత సీతారాం నాయక్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.