ఏరియా ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్
KMM: వైరాలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్మాణ పురోగతిని పరిశీలించిన ఆయన, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.