చిత్తూరు పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు 15 వరకు గడువు
CTR: చిత్తూరు జిల్లాలో పంచాయతీ పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. మొత్తం రూ.27.41 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి 28 నాటికి 75% అయిన రూ.20.55 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన 25% వసూళ్ల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.