హైద్రాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని కమ్మేసిన పొగమంచు
RR: హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని పొగమంచు కమ్మేసింది. ఆమనగల్, కందకూరు, తలకొండలపల్లి, అటు షాద్నగర్ హైవేపై ఉ.4 నుంచి 8:30 దాటినా మంచు దట్టంగా కురుస్తూనే ఉంది. మండలాల నుంచి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లు, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా కదిలాయి.