కోసిగిలో ఎక్సైజ్ వాహనాల వేలం పాట
KRNL: కోసిగి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో పట్టుబడిన వాహనాలను కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు గురువారం వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పాల్గొనేవారు ఉదయం 09.30 గంటలకు 3,000 అడ్వాన్స్ కట్టి పేర్లు నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. టోకెన్ పొందిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.