కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ప్రకాశం: కంభంలోని నర్సిరెడ్డిపల్లిలో శుక్రవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ పాల్గొని గ్రామంలోని కంది పంటను పరిశీలించారు. కంది పంట ఇప్పుడే కళ్ళేదశలో ఉందని, పూత దశకొస్తుందని, ఈ దశలో పురుగులు వ్యాపించకుండా వేప కషాయాన్ని ఎకరానికి లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాలని సూచించారు.