ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: MLA
KMR: యూత్ కాంగ్రెస్ నాయకుడు సతీష్ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం అన్నారు. తాడ్వాయి మండలం దేవయిపల్లికి చెందిన మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సతీష్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియలో ఎమ్మెల్యే పాల్గొని పాడే మోశారు.