BIG ALERT: మరోసారి గడువు పెంపు

BIG ALERT: మరోసారి గడువు పెంపు

TG: ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్టియర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 31 వరకు పెంచింది. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఉన్న కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలని బోర్డు అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల జాబితా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.