VIDEO: మారిన వాతావరణంతో రైతులు ఆందోళన
KKD: సామర్లకోటలో గురువారం సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలతో దడ పుట్టించిన ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 4.30 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు వీచాయి. చల్లని చిరుగాలులు వీయడంతో వాహనదారులు, ప్రయాణికులు కొంత ఊరట చెందారు. అకాల వర్ష సూచనలతో రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.