కార్మిక సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

కార్మిక సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

PDPL: తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని తిలక్ నగర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సహజ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 13 లక్షల కార్డుల రెన్యువల్, క్లెయిమ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.