పాడి రైతులకు శిక్షణ

జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా పాడి రైతులకు శిక్షణ ఇచ్చారు. మాకవరపాలెం వెలుగు కార్యాలయంలో జరిగిన శిక్షణలో పశువైద్యాధికారి అశోక్ రాయితీపై పశువుల కొనుగోలు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందించే రాయితీ రుణాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీతామహాలక్ష్మీ, వెలుగు ఏపీఎం చినబాబు పాల్గొన్నారు.