VIDEO: రవాణా శాఖ కార్యాలయంపై ఆకస్మిక దాడులు
కృష్ణా: మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, కీలక పత్రాలను సవివరంగా పరిశీలిస్తున్నారు.