నేడే ఓట్ల లెక్కింపు.. ఏయూలో ఆంక్షలు..!
VSP: టీచర్స్ MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు AUలో ఈ రోజూ ఉ.8 గంటలకు ప్రారంభం కానుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఏయూ పరిసర ప్రాంతాలలో ఉ.6 నుంచి కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుంపుగా తిరుగుట నిషేధమన్నారు. మొత్తం 20,783 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.