ముగిసిన జాతర.. నెమ్మదిగా సాధారణ స్థితికి ప్రాంతం

ముగిసిన జాతర.. నెమ్మదిగా సాధారణ స్థితికి ప్రాంతం

MULG: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర ముగియడంతో ఆదివారం మేడారం పరిసరాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. నాలుగు రోజులుగా లక్షలాది భక్తులతో కళకళలాడిన గద్దెల ప్రాంగణం, రహదారులు బోసిపోయాయి. తాత్కాలిక దుకాణాలు, హోటళ్లు మూసివేయడంతో వ్యాపార సందడి తగ్గింది. జాతర కోలాహలం మాయమై మేడారం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.