గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే
ADB: ఉట్నూర్ మండలంలోని గ్రామాల్లో వేసవి కాలం దృష్ట్యా ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. బుధవారం మండలానికి చెందిన సర్పంచులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎవరు కూడా నీళ్ల కోసం ఇబ్బందులు పడవద్దని అవసరమైన చోట బోర్వెల్ సైతం మంజూరు చేస్తానని.. దానికి అనుగుణంగా సర్పంచులు పనిచేయాలని సూచించారు.