కొడంగల్ అభివృదికై CM ప్రత్యేక చొరవ

VKB: అన్నీ రంగాల్లో వెనుకబాటుకు గురైన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భారీగా నిధులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే మంజూరైన రూ.6146.97 కోట్లకు పైగా నిధులతో వివిధ పనులు కొనసాగుతున్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురైన కొడంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.