తేలప్రోలులో విద్య వారోత్సవాల ర్యాలీ

తేలప్రోలులో విద్య వారోత్సవాల ర్యాలీ

కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నట్లు తేలప్రోలు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్ మై తెలిపారు. సోమవారం తేలప్రోలులోని పలు వీధుల్లో విద్య వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.