'నిధులను డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాలి'
GDWL: రైతుబంధు నిధులను బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా, రైతులు డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీటీసీ రాజు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌ను కోరారు. ప్రజావాణిలో వినతిపత్రం అందజేస్తూ, బ్యాంకుల తీరుతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.