పరిటాల నారాయణమ్మకు ఎమ్మెల్యే ఘన నివాళి
ATP: దివంగత నేత పరిటాల రవీంద్ర మాతృమూర్తి పరిటాల నారాయణమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. నారాయణమ్మ ఆశయాలు, ఆమె అందించిన స్ఫూర్తిని ఈ సందర్భంగా సునీత స్మరించుకున్నారు.