సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం!
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో కొత్త సందడి మొదలైంది. అభ్యర్థులు తమ హామీలు, అజెండాలను గతంలో రచ్చబండ వద్ద కాగా, ప్రస్తుతం వాట్సప్ గ్రూపులు, స్టేటస్ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. గ్రామ సమస్యలపై, ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై గ్రామస్తులు కూడా ఆన్‌లైన్‌లో చర్చించుకుంటున్నారు.