నేడు ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్

IPLలో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. వాంఖడే స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.