VIDEO: రాంపూర్‌లో ఘనంగా నల్ల పోచమ్మకు బోనాలు

VIDEO: రాంపూర్‌లో ఘనంగా నల్ల పోచమ్మకు బోనాలు

MDK: కొల్చారం మండలం రాంపూర్‌లో గ్రామదేవతల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి నల్ల పోచమ్మకు బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య నృత్యాలు చేస్తూ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.